Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు దాటేటప్పుడు అలా చేస్తున్నారా...? ఈ వీడియో చూస్తే షాకవుతారు..

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (12:15 IST)
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏమరపాటుగా ఉంటే తీరని నష్టం జరుగుతుందని చెప్పడానికి ఈ వీడియో చాలు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతం చింతల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
వీడియో ప్రకారం.. నిర్లక్ష్య ధోరణిలో ఒక వ్యక్తి తన చేతిలోని వస్తువుపైనే పూర్తి ధ్యాస పెడుతూ.. మిగిలిన వాటి గురించి పట్టించుకోకుండా రోడ్డు దాటుతుంటే.. ఈలోపే వేగంగా వస్తున్న ఓ బైకర్ అతడిని బలంగా ఢీకొన్నాడు. దీనితో రోడ్డు దాటుతున్న వ్యక్తి, బైకర్ తలో దిక్కులో పడ్డారు. బైక్‌పై ఉన్న వ్యక్తికి హెల్మెట్ లేకపోవడమే కాకుండా అతడు దురదృష్టవశాత్తు కారు టైర్ కింద పడ్డాడు. కారును డ్రైవర్ వెంటనే ఆపేసినా.. అతను మాత్రం కదలకుండా రోడ్డుపై అలానే పడిపోయి ఉన్నాడు.
 
ఈ ఘటన హెల్మెట్ ఆవశ్యకతను మరోసారి చాటుతోంది. నెటిజన్లలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments