హైదరాబాదులో కొత్త జబ్బు.. నల్లిన పోలిన పురుగులతో?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:42 IST)
హైదరాబాదును కొత్త వైరస్ పట్టిపీడిస్తోంది. ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ముప్పుతో జనం జడుసుకుంటున్న తరుణంలో  నగరంలో స్క్రబ్‌ టైఫస్‌ బాధితులు ఎక్కువయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏకంగా 15 మంది ఈ స్క్రబ్‌ టైఫస్‌ చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ బాధితుల్లో పిల్లలే ఎక్కువమంది ఉన్నారట. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
 
ఈ స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల సోకుతుంది. ఇవి ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఆ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయి. 
 
అంతేకాదు ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయి. ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments