Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో హద్దులు దాటిన ప్రేమ... ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

హైదరాబాద్‌లో మరో అమానుష చర్య జరిగింది. తరగతి గది ప్రేమ హద్దులు దాటింది. ఫలితంగా ఓ ఇంటర్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత కుమారుడు రంగ

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (11:46 IST)
హైదరాబాద్‌లో మరో అమానుష చర్య జరిగింది. తరగతి గది ప్రేమ హద్దులు దాటింది. ఫలితంగా ఓ ఇంటర్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత కుమారుడు రంగంలోకి దిగాడు. కానీ, ఇరుగుపొరుగు వారి చెవిన పడటంతో మీడియా దృష్టికి రావడంతో బహిర్గతమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, అల్వాల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే 17 సంవత్సరాల యువతి, యువకుడు ఒకే విద్యా సంస్థలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. ఈ క్రమంలో వారిద్దరి ప్రేమ తరగతి గదిలోనే హద్దులు దాటింది. ఫలితంగా ఆ యువతి ఫిబ్రవరి 14న పురిటి నొప్పులతో గాంధీ ఆసుపత్రిలో చేరింది.
 
అక్కడ సదరు యువతి ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీన్ని గాంధీ ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్‌ కేసుగా పరిగణించి అల్వాల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడే వివాదం మలుపు తిరిగింది. ఓ రాజకీయ నేత కుమారుడు రంగంలోకి తెరపైకి వచ్చాడు. యువతి తల్లిదండ్రులతో బేరసారాలు, ఒప్పందాలకు కుదుర్చుకుని విషయాన్ని గుట్టుగా దాచేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, యువతి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం వివాహం చేసుకోవాలని పట్టుబట్టారు. ఇద్దరు మైనర్లు కావడంతో పెళ్లికి వయస్సు అడ్డువచ్చింది. మైనారిటీ తీరిన తర్వాత తర్వాత పెళ్లి చేయిస్తామని పెద్దలు ఒప్పందం చేయించారు. చిన్నారిని ఓ శిశుసదనంలో చేర్పించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments