Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం ... తెలంగాణాకు ఎల్లో అలెర్ట్

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:41 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఈ వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడివున్న అల్పపీడనం కారణంగా ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. 
 
ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదేసమయంలో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందువల్ల రాబోయే రెండు రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. 
 
ముఖ్యంగా, ఉదయం సాయంత్రం వేళల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పాలమూరు, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్ధిపేట, యాదాద్రి, భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆ జిల్లాల అధికారులను ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తం చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments