Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టా లోన్.. పరువు పోతుందని మహిళ చీరకు ఉరేసుకుని ఆత్మహత్య

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (10:13 IST)
ప్రైవేట్ ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు, ఆన్‌లైన్‌, లోన్‌యాప్ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మహిళ రుణాల బాధలకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. 
 
గ్రేటర్ హైదరాబాద్‌ శివారులో ఓ మహిళ ప్రైవేట్ ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ సూసైడ్‌ లెటర్ రాసింది. అందులోనే తన చావుకు కారణమైన వారి పేర్లను రాసింది మృతురాలు.
 
ఈ క్రమంలోనే మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా రాజబొల్లారం తండాకు చెందిన మాలోత్ సునీత అనే మహిళ కూడా ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ సంస్థ దగ్గర రుణం తీసుకుంది. 
 
అనుకోకుండా శుక్రవారం తన ఇంట్లో చీరతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్చుల సమాచారం మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గదిలో లభించిన సూసైడ్ లెటర్ ఆధారంగా సునీతను ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు వేధించడం వల్లే ప్రాణాలు తీసుకుంటున్నట్లుగా సూసైడ్‌ లెటర్‌లో పేర్కొంది.
 
పరువు పోతుందనే భయంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 
 
సునీత శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలో మల్టీ బ్రాండ్‌ పేరుతో బైక్‌ జోన్ షోరూం నడుపుతోంది. 20ఏళ్ల క్రితమే ఎస్‌ఆర్‌ నగర్‌కి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. ఓ కూతురు పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. 
 
గత పది సంవత్సరాలుగా సునీత మేడ్చల్ పట్టణం కేఎల్లార్‌ వెంచర్‌లో అద్దెకు నివసిస్తోంది. అవసరాల కోసం అప్పు చేశానని.. అయితే వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు మృతురాలు ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. 
 
తన చావుకు పూరెల్లి ప్రభాకర్రెడ్డి ప్రధాన కారకుడు అని రాసింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు

బెంగళూరు రేవ్‌ పార్టీలో వెలుగులోకి వచ్చిన కొత్త విషయం... ఏంటది?

నటి హేమ, ఆషీరాయ్ Rave Partyలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించేవారో వివరించిన విజయ్ దేవరకొండ

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments