Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్టేషన్ పక్కనే యువకుడు దారుణ హత్య.. పోలీసులేం చేశారంటే..

భాగ్యనగరం హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్నేహితులే అతి దారుణంగా నరికి చంపేశారు. అది కూడా నడిరోడ్డుపై, పోలీస్టేషన్‌కు అతి సమీపంలోనే. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (16:36 IST)
భాగ్యనగరం హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్నేహితులే అతి దారుణంగా నరికి చంపేశారు. అది కూడా నడిరోడ్డుపై, పోలీస్టేషన్‌కు అతి సమీపంలోనే. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్ మూసాపేటలోని జనతానగర్‌లో రాజు అనే వ్యక్తి పాలవ్యాపారం చేస్తుండేవాడు. రాజుకు మొత్తం నలుగురు కుమారులు ఉన్నారు. చివరి  వ్యక్తి సుధీర్ కూకట్‌పల్లి లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్నిరోజులుగా తన స్నేహితులతో సుధీర్‌కు గొడవలుండేవి. ఆ గొడవల కారణంగా నలుగురు స్నేహితులు కలిసి ఉదయం కళాశాలకు వెళుతున్న సుధీర్‌ను వెంబడించి అతి దారుణంగా రోడ్డుపై నరికి నరికి చంపారు. కూత వేటు దూరంలో పోలీస్టేషన్, ఎప్పుడూ ప్రజలు తిరుగుతుండేవారు. అలాంటి ప్రాంతంలోనే హత్య జరగడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
యువకుడు దారుణ హత్యకు గురైన తరువాత తాపీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన తరువాత నలుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ నిందితుడి ద్వారా మిగిలిన వారిని ఈజీగా పోలీసులు కనిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments