Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరారం చెరువు కట్టపై ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన దంపతులు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (08:18 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని సూరారం చెరువు కట్టపై పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి దంపతుల జంట సురక్షితంగా చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. 
 
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సూరారం చెరువు కట్టపై విద్యుత్‌ సామాగ్రి లోడుతో ఉన్న ఓ కంటైనర్‌ వేగంగా దూసుకెళ్తున్నది. అయితే కంటెయినర్‌లో ఉన్న లోడు ఒక్కసారిగా దానిపైనుంచి జారి పక్కనే వస్తున్న కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమయింది. 
 
అందులో ఉన్న దంపతులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారులో చిక్కుకున్న దంపతులను రక్షించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అయితే డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments