Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు బెయిల్

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (17:28 IST)
హైదరాబాద్ నగరంలోని గోషామహాల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బీజేపీకి చెందిన రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా, నిరాశ ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయన అనుకూలంగా తీర్పు వచ్చింది షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని రాజాసింగ్‌కు కోర్టు సూచించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయొద్దని, మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని ఇలా పలు షరతులు విధించింది. అంతేకాకుండా, తక్షణమే రాజాసింగ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 
 
పీడీయాక్ట్ కింద రాజా సింగ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయగా, ఆయన గత 40 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. చివరకు పలు మార్లు న్యాయపోరాటం తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments