Webdunia - Bharat's app for daily news and videos

Install App

15ఏళ్ల బాలికపై ప్రేమ పేరుతో లైంగిక దాడి.. మరో యువకుడి బ్లాక్ మెయిల్‌, అత్యాచారం..

15ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. తన గదికి తీసుకొచ్చి చాలాసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న స్నేహితుడు.. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బాల

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:42 IST)
15ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. తన గదికి తీసుకొచ్చి చాలాసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న స్నేహితుడు.. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బాలికను బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను హైదరాబాదులోని అమీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌(21) కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మంద మల్లమ్మ చౌరస్తాలోని జహంగీర్‌ఖాన్‌కు చెందిన వెల్డింగ్‌ షాప్‌లో పని చేస్తూ ఉండేవాడు. న్యూమారుతీనగర్‌లోని జహంగీర్‌ ఇంట్లో నివాసం ఉంటూ వచ్చాడు. తొమ్మిది నెలల క్రితం అక్కడే నివసించే 15ఏళ్ల బాలికను పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
దీన్ని ఆసరాగా తీసుకున్న జహంగీర్‌.. బాలికకు సంబంధించిన ఫోటోలున్నాయని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఫోటోలు నెట్లో పెట్టేస్తానని బెదిరించాడు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయినా ఫోటోలు ఇవ్వకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయాలన్నీ చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం