Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులం తక్కువ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావో అంతే : మోసపోయిన యువతి!

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (10:07 IST)
ప్రేమించేటపుడు.. పెళ్లి చేసుకునే సమయంలో యువకుని కుటుంబసభ్యులకు కనిపించని, అడ్డురాని కులం.. ఐదు నెలలు కాపురం చేసిన తర్వాత అడ్డొచ్చాయి. అందుకే కులం తక్కువ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే అంతే సంగతులు అంటూ యువకుని కుటుంబసభ్యులు బెదిరించారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుని సంసారం చేసిన పాపానికి ఓ యువతి నడి రోడ్డుపై అనాథగా నిలబడింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటికి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన హైదరాబాద్, హయత్ నగర్ మండలంలో చోటుచేసుకుంది. 
 
ఆదివారం వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే.. హయత్‌నగర్‌ మండలం బండరావిరాల గ్రామానికి చెందిన కందికట్ల రమేష్‌, రత్నమ్మ కుమార్తె గీత. అదే గ్రామానికి చెందిన పల్లపు రాములు, అండాలు కుమారుడు సురేష్‌‌. వీరిద్దరు కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి గత జనవరి 12వ తేదీన సికింద్రాబాద్‌ ఆర్యసమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి గీత, సురేష్‌ ఉప్పల్‌లో కాపురం పెట్టారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా సురేష్‌కు పనిలేక ఆర్థిక ఇబ్బందులుతలెత్తాయి. నెలరోజుల తర్వాత తీసుకెళతానని భార్యను పుట్టింటికి పంపించివేశాడు. అతడు మాటలు నమ్మిన గీత నెలరోజులుగా అమ్మగారింట్లోనే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో భర్తతో మాట్లాడేందుకు అనేకమార్లు ఆమె ఫోన్ చేసినా స్పందించడం లేదు. 
 
దీంతో అనుమానం వచ్చిన గీత సురేష్‌ ఇంటికి ఆదివారం వెళ్లింది. అతడి కుటుంబసభ్యులు ఇంటికి తాళంవేసి వెళ్లిపోయారు. న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. అన్యాయం చేశాడని ఆరోపిస్తోంది. కులం తక్కువ అమ్మాయిని ఇంటికి తీసుకురావద్దని అతడి కుటుంబసభ్యులు అడ్డుపడుతున్నారని గీత తెలిపింది.

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments