Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (20:52 IST)
కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్యే సీపీఆర్​వో రాకేశ్​ తెలిపారు. లోకో పైలెట్​ను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్​వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఎంఎంటీఎస్​ లోక్​ పైలెట్​ సిగ్నల్​ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు. లోకో పైలట్​ చంద్రశేఖర్​తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్​వో తెలిపారు.

బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.

ప్రమాదం వల్ల సికింద్రాబాద్​- ఫలక్​నుమా, కాచిగూడ-ఫలక్​నుమాకు వెళ్లాల్సిన ఎంఎంటీఎస్​ రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు ఫలక్​నుమా- జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్​ సిటీ, ఫలక్​నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశామని వివరించారు.

కాచిగూడ-గుంటూరు, ఫలక్​నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments