Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (11:25 IST)
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు ఆ రాష్ట్ర హైకోర్టు సమ్మతం తెలిపింది. సచివాలయం కూల్చివేతలో ఎదురైన అడ్డంకులన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికమించి, విజయం సాధించింది. ఫలితంగా తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. 
 
సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
 
మరోవైపు, పాత సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ ధాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టాలని ప్రభుత్వం భావించింది. 
 
దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చివరకు మార్చి 10న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments