Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్ సెగలు... ఏపీలోని రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (14:17 IST)
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లు హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఏపీలో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
ఏపీలోని పలు కీలక రైల్వే స్టేషన్ల వద్ద భారీగా మొహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విజయాడలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్టేషన్ల పరిసరాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు హెచ్చరికలు చేశారు. గుంటూరు, కడప, నరసరావు పేట, బాపట్ల స్టేషన్లలో రైల్వే రక్షణ దళాలు భద్రతను పెంచేశాయి. అలాగే, రైల్వే స్టేషన్లలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. ఉన్నతాధికారులు ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు యువత విధ్యంసానికి పాల్పడి ఫ్లాట్‌ఫాంలపై ఉన్న దుకారణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. రైళ్ల బోగీలకు నిప్పంటించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments