Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లి జోలికి రావద్దన్నారు.. వినలేదు.. చెల్లి పెళ్లి ఎలా చేస్తారో చూస్తా అన్నాడు.. గొంతు కోశారు.. అవసరమా?

ప్రేమకు ఉన్న అర్థం కూడా తేలీని వయసులో కామ నరం పెట్రేగిపోతున్న వయసు పొగరులో దూకుడుగా పోతే అవతలివారు కూడా అదే దూకుడును తనమీద ప్రయోగిస్తారని గ్రహించని ఆ యువకుడు కత్తిపోట్లకు గురై కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ దారుణానికి కారణం ఇష్టం లేని ప్రేమ.

Webdunia
గురువారం, 4 మే 2017 (07:43 IST)
ఎక్కడ ఉన్నా ఏమైనా. మనమెవరికి వారే వేరైనా.. నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా అంటూ ప్రియురాలు దూరమైన బాధను తాత్వీకరించిన నాటి బంగారు కాలం కాదిది. నేను ప్రేమిస్తున్నా.. నువ్వూ నన్ను ప్రేమించాలి.. కాదన్నావో నీ అంతు తేలుస్తా.. నీ పెళ్లికాకుండా చూస్తా.. నువ్వెలా బతుకుతావో చూస్తా అనే వన్ సైడ్ నిర్బంధ ప్రేమల కాలం ఇది. ప్రేమకు ఉన్న అర్థం కూడా తేలీని వయసులో కామ నరం పెట్రేగిపోతున్న వయసు పొగరులో దూకుడుగా పోతే అవతలివారు కూడా అదే దూకుడును తనమీద ప్రయోగిస్తారని గ్రహించని ఆ యువకుడు కత్తిపోట్లకు గురై కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ దారుణానికి కారణం ఇష్టం లేని ప్రేమ. తమ చెల్లెలికి నిశ్చితార్థమైంది దయచేసి ఆమెను వదిలేయ్. ఆమెను వేధించవద్దు అని అన్నలు వేడుకున్నా కరగని తత్వం. నాకు దక్కకుండా మరొకడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారో చూస్తా అంటూ నేరుగా ఇంటి వద్దకే వస్తూ బెదిరింపులకు పాల్పడితే. ఎన్నాళ్లు ఊరుకుంటారు? అందుకే ఆ యువకుడిని ఆ చెల్లెలి సోదరులు కాపు గాచి మరీ పట్టుకుని గొంతు కోసేశారు. 
 
ఆలూరు ఎస్సీ కాలనీకి చెందిన సురేంద్ర అదే కాలనీకి చెందిన ఓ యువతిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. వెంటపడి తననే పెళ్లి చేసుకోవాలని భయాందోళనకు గురి చేశాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పింది. దీంతో వారు యువకుడిని యువకుడిని మందలించారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. అయినా సురేంద్ర ఆ యువతిని వేధిస్తుండటంతో పాటు పెళ్లి కూడా కాకుండా అడ్డుకుంటానని హెచ్చరించాడు. దీంతో అతనిపై కక్ష కట్టిన ఆ యువతి సోదరులు జగన్, నాగరాజు నెల క్రితమే సురేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు.
 
విషయం తెలుసుకున్న సురేంద్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని బెంగళూరుకు వలస పంపారు. కాగా ఇటీవల బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న సురేంద్ర సోదరుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న అంత్యక్రియలకు హాజరైన సురేంద్ర తిరిగి బెంగళూరుకు వెళ్లకుండా గ్రామంలోనే ఉండి మళ్లీ యువతిని వేధించ సాగాడు. తరచూ  ఆమె ఇంటి ముందే తిరుగుతుండడంతో జగన్, నాగరాజు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఎలాగైనా అతడిని చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. 
 
బుధవారం ఉదయం 6.30 గంటలకు సురేంద్ర బహిర్భూమికి ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో  ఆదిఆంధ్ర పాఠశాలోనికి బలవంతంగా లాక్కెళ్లారు. ముందుగానే అక్కడ ఉంచిన కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో చనిపోయాడని భావించి నిందితులు వెళ్లిపోయారు. కొద్ది సేపటికి సమాచారం అందుకున్న యువకుడి తల్లి, బంధువులు అక్కడికి చేరుకుని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్‌ను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. సురేంద్ర తల్లి మారెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు ఆలూరు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 stampede: Woman dead మహిళ ప్రాణం తీసిన 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో (Video)

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments