తెలంగాణలో దంచి కొడుతున్న భారీ వర్షాలు.. ఆ ఐదు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

Webdunia
శనివారం, 23 జులై 2022 (09:54 IST)
తెలంగాణ మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కుమ్మేస్తున్నాయి. 
 
నైరుతి రుతుపవనాలతో పాటు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. దీంతో ఆయా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. 
 
అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని.. ఐదురోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే హైదరాబాద్ నగర పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments