Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. పొంగుతున్న వాగులు!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (09:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చింతూరులో అత్యధికంగా 17.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఓపెన్కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో సింగరేణి ఓపెన్ కాస్టింగ్ బొగ్గు గనుల్లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రిజర్వాయర్లోని 17 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. 
 
మరోవైపు.. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments