Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 3.75 కోట్ల నగదు స్వాధీనం...

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:34 IST)
హైదరాబాద్ నగరంలో 3.75 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా హవాలా మనీగా గుర్తించారు. భాగ్యనగరంలో జరుగుతున్న హవాలా రాకెట్‌కు సంబంధించిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరంతా హవాలా మార్గాల్లో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.3.75 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ నలుగురు వ్యక్తులు ముంబైకి చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తేలింది. ఆ సంస్థ యజమాని అహ్మదాబాద్‌కు చెందినవాడిగా తెలిసింది. 
 
హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కాగా స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments