Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌కు వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిందే... ఎక్కడ?

కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆధార్ నంబరును ఇపుడు మరో దానికి లంకె పెట్టనున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులకు, విద్యార్హత ధృవీకరణ పత్రాలకు, గ్యాస్ సిలిండర్లకు, పాన్ నంబర్లకు, బ్యాంకు ఖాతాలకు ఇలా ప్రతి దానికి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (14:12 IST)
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆధార్ నంబరును ఇపుడు మరో దానికి లంకె పెట్టనున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులకు, విద్యార్హత ధృవీకరణ పత్రాలకు, గ్యాస్ సిలిండర్లకు, పాన్ నంబర్లకు, బ్యాంకు ఖాతాలకు ఇలా ప్రతి దానికి లంకె పెడుతూ వస్తున్నారు. 
 
అయితే, హైదరాబాద్ నగర పోలీసులు మరో అడుగు ముందుకేసి... ఆధార్ నంబరుకు, పబ్‌కు లింకు పెట్టారు. ఈ రెండింటికేంటి లింకేంటి? అనేదే కదా మీ సందేహం. అంటే.. ఇకపై పబ్‌లోకి ఎంట్రీ కావాలంటే ఆధార్ నంబరును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నమాట. 
 
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో డ్రగ్ కల్చర్ గణనీయంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. ఈ డ్రగ్ వ్యవహారం కోలీవుడ్‌ను ఓ కుదపు కుదిపింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  
 
పబ్‌కు వెళ్లే వాళ్లు ఇక నుంచి ఖచ్చితంగా తమ ఆధార్ కార్డులను చూపించాలి. ఈ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ పేర్కొన్నది. వాస్తవానికి ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటేనే పబ్‌లోకి ఎంట్రీ కల్పిస్తారు. కానీ ఇక నుంచి ఆధార్ తప్పనిసరి. 
 
ఇటీవల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్ రాకెట్ ద్వారా ఈ విషయం బయటపడింది. 21 ఏళ్లు దాటినవాళ్లు మాత్రమే పబ్‌లోకి ఎంటర్ కావాలి. ఐడెంటీ కార్డు అనేది కొత్త రూల్ కాదు అని, ఆధార్ కార్డు తప్పనిసరి అన్నదే కొత్త విషయమని ఎక్సైజ్ సూపరిండెంట్, సిట్ చీఫ్ శ్రీ శ్రీనివాస్ రావు తెలిపారు. నగరంలో ఉన్న 14 పబ్‌లకు ఇప్పటికే సిట్ వార్నింగ్ లేఖలను పంపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments