Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:34 IST)
ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఓ శుభవార్త చెప్పింది. ఇంటర్ మొదటి సంవత్సరం టికెట్‌లను ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. 
 
ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు.
 
హాల్ టికెట్ లో ఏవైనా తప్పులు ఉంటే కాలేజీ ప్రిన్సిపల్ లేదంటే జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా హాల్ టికెట్‌లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టంచేశారు. 
 
ఇదిలావుంటే, గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఇతర కారణాలవల్ల ఇంటర్ పరీక్షలను నిర్వహించలేదు. అంతేకాకుండా విద్యార్థుల గత మార్కులను ఆధారంగా చేసుకొని పాస్ చేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులకు పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments