Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ.. కోటి వృక్షార్చన.. తెలంగాణకు పండుగ రోజు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (09:02 IST)
కేసీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను టీఆర్‌ఎస్‌ ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేసింది. కోటి వృక్షార్చన ఒక గంటలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటనున్నారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటనున్నారు. కోటి వృక్షార్చనలో పాల్గొనేందుకు టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు రెడీ అయ్యారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపుతో.. కోటి వృక్షార్చనకు అనూహ్య స్పందన లభిస్తోంది. 
 
అలాగే జలవిహార్‌లో 68కిలోల కేక్‌ను మంత్రులు కట్ చేయనున్నారు. కేసీఆర్ జీవిత విశేషాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ.. త్రీడి గ్రాఫిక్స్‌లో రూపొందించిన 30 నిముషాల డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు.
 
ఇకపోతే.. సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కారణ జన్ములైన కేసీఆర్‌ వల్లే దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని అన్నారు. కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు.
 
కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజని చెప్పారు. 'మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశారు.
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
 
సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అహింసే ఆయుధంగా, సంకల్పమే సాధనంగా, ఊపిరే పణంగా పెట్టి తెలంగాణ స్వరాష్ట్ర పోరులో విజేతగా నిలిచి.. తెలంగాణ తల్లిని బంధవిముక్తురాలిని చేసిన ఉద్యమ సారధి, తెలంగాణ ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments