Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్గిపెట్టి ఉందా అని అడిగి.. 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లారు

కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:41 IST)
కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి కూడలిలో భుజంగ్ రెడ్డి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
 
నిన్న రాత్రి బైక్ వచ్చిన ఓ యువకుడు సిగరెట్ తీసుకొని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఇవ్వమని అడిగాడు. యజమాని వొంగి కింద ఉన్న అగ్గిపెట్టి తీసి ఇచ్చే సమయంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు దొంగలు. వెంటనే తేరుకున్న భుజంగ్ రెడ్డి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేసి అరుస్తూ  పరిగెత్తుకుంటా వెళ్లాడు. 
 
అయినా  దొంగలు బైకు మీద పారిపోవడం వల్ల ఫలితం లేక పోయింది. భుజంగరెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషనును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి ఫుటేజ్‌ను పరిశీలించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments