Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీటి బాధలోనూ కుమార్తె అవయవాలను దానం చేసిన తండ్రి..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన తన కూతురు అవయవాలను దానం చేశాడు మానవత్వం ఉన్న ఓ తండ్రి. ఇస్మాయిల్ ఖాన్ ఘట్కేసర్ మండలానికి చెందిన తాడేపల్లి జయరాంకు భార్యా, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ కుట

Webdunia
బుధవారం, 11 జులై 2018 (12:10 IST)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన తన కూతురు అవయవాలను దానం చేశాడు మానవత్వం ఉన్న  ఓ తండ్రి. ఇస్మాయిల్ ఖాన్ ఘట్కేసర్ మండలానికి చెందిన తాడేపల్లి జయరాంకు భార్యా, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద దిక్కుగా ఉంది. గత ఆదివారం ఉదయం తన తల్లితో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన జీహెచ్ఎంసీకి చెందిన డంపింగ్ ట్రక్ అతి వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది భార్య.
 
తీవ్రంగా గాయపడిన కూతుర్ని బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కూతురు బ్రైన్ డెడ్ అయిందని డాక్టర్లు నిర్ధారించడంతో శోకసముద్రంలో మునిగిపోయాడు తండ్రి. తన కుమార్తె శ్రుతి అవయవాలను ఎవరికైనా దానం చేస్తే... వారిలో తన కూతురిని చూసుకోవచ్చని వారు అన్నారు. 
 
తన భార్యా మాధవి, కూతురు శ్రుతి మృతితో వారి కుటుంబానికి తీరని లోటని బంధువులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కూతురు అవయవాలను జీవన్ దాన్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. తన భార్య, కూతురు మృతి చెందడానికి డ్రైవర్ పూటుగా తాగడమే కారణమని, అటువంటి వారివల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయని, వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని తండ్రి కోరుతున్నాడు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments