Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్నకు షాక్... జీహెచ్ఎంసీ దెబ్బకు 3 గంటల్లో తట్టాబుట్టా సర్దేశారు...

GHMC officials
Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:26 IST)
సినిమాలలో అయితే తాతగారి పేరుతో నెట్టుకొచ్చేసారు కానీ... మరి బయట పరిస్థితి... అసలే మనకు సంబంధించిన పార్టీ అధికార పక్షంగా కాదు కదా... కనీసం ప్రతిపక్ష స్థాయిలో కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయిన రాష్ట్రంలో పరిస్థితులు ఇంతేగా మరి.
 
వివరాలలోకి వెళ్తే... నందమూరి తారకరత్నగా తెలుగు జనాలకు అప్పుడెప్పుడో కనబడిన నందమూరి హీరోకి జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా షాకిచ్చారు. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెం-12లో తారకరత్న నడుపుతున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను కూల్చివేతకు సోమవారం ప్రయత్నించారు. ఈ రెస్టారెంట్‌ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని.. అందుకే కూల్చడానికి వచ్చామని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బంది-అధికారుల మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. 
 
జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చారన్న సమాచారం అందుకున్న తారకరత్న రెస్టారెంట్‌ దగ్గరకు చేరుకొని, జరిగిన విషయాలను ఆరా తీయగా... నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్న కారణంగా రాత్రి వేళల్లో మద్యం మత్తులో డీజే సౌండ్‌తో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు తాము ఈ చర్యలకు దిగినట్లు అధికారులు చెప్పడంతో వెనక్కు తగ్గిన హీరోగారు వారిని సామగ్రిని తరలించేందుకు కొంత సమయం కోరగా... అధికారులు మూడు గంటల గడువు ఇచ్చినట్లు, సామగ్రి తరలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఎంతైనా అనువుగాని చోట అధికులమనరాదు... అనేది ఇందుకేనేమో మరి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments