Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గ్రేటర్'లో గెలిచిన ఆ ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా తెరాసలో చేరిపోతారట...

తెలంగాణలో హస్తం ఖాళీ అయిపోతుందా... ఆల్రెడీ ఏపీలో కనుమరుగైంది...

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (12:55 IST)
తెలంగాణలో నిన్ననే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 99 స్థానాల్లో గెలుపొంది చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఐతే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచి డీలా పడిపోయింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు కూడా గులాబీ పార్టీ కారు ఎక్కేందుకు సిద్ధమయిపోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
ఆమధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, తెదేపాల నుంచి అభ్యర్థులగా బరిలోకి దిగినవారిలో చాలామంది పోటీ నుంచి తప్పుకుని తెరాసకు ఏకగ్రీవం ఖరారు చేసిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు కూడా కారు ఎక్కేందుకు వెనుకాడే పరిస్థితి ఏమీ ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అదే జరిగితే గ్రేటర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోతుంది. ఇక తెదేపా-భాజపా పార్టీల భాగస్వామ్యమైనవి కావడమే కాకుండా ఇటు ఏపీలోనూ, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్నాయి కనుక ఆ పార్టీకి చెందిన వారు గట్టు దాటే పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments