Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్... నయీం నీడలా మాజీమంత్రి... ఆయన 'హస్తం' కూడా.. అరెస్టు షురూ...?

మాఫియా అనగానే వారితోపాటు రాజకీయ నాయకులు కూడా సహవాసం చేస్తుంటారని మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజానికి సినిమాలు నిజ జీవితాల నుంచి ప్రేరణ పొంది తీసేవే. ఇప్పుడు అలాంటి ట్విస్టు నయీం కేసులో వెలుగుచూసినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నయీంను పెంచిపోషించింది

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (12:50 IST)
మాఫియా అనగానే వారితోపాటు రాజకీయ నాయకులు కూడా సహవాసం చేస్తుంటారని మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజానికి సినిమాలు నిజ జీవితాల నుంచి ప్రేరణ పొంది తీసేవే. ఇప్పుడు అలాంటి ట్విస్టు నయీం కేసులో వెలుగుచూసినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నయీంను పెంచిపోషించింది... తన నీడలా ఉండి అన్నీ నడిపించింది నల్గండ జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి అనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు తెలీకుండా నయీం చేసిన నేరాలు లేవని కూడా అంటున్నారు. 
 
ఆ మాజీ మంత్రి అండతోనే నయీం ఇంతటి స్థాయికి ఎదిగాడనీ, ప్రభుత్వ నేతలను సైతం బెదిరించే స్థాయికి అతడు ఎదగడానికి కారణం రాజకీయ నాయకులేననే ప్రచారం జరుగుతోంది. కాగా నయీంకు వెన్నుదన్నుగా నిలిచిన సదరు మంత్రిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆయన్ని అరెస్టు చేస్తారని అంటున్నారు. కాగా నల్గొండ జిల్లాకు చెందిన ఆ మంత్రి ఎవరబ్బా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. 
 
తరచితరచి చూస్తే నల్గొండ జిల్లాల్లో రెడ్డి సమాజిక వర్గానిదే పైచేయిగా ఉంటుంది. ఆ ప్రకారం చూసినప్పుడు మాజీమంత్రి జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి.. తదితరులు ముందువరుసలో ఉంటారు. వైఎస్ హయాంలో ఇద్దరు మంత్రులు పూర్తిస్థాయిలో ఇక్కడ చక్రం తిప్పారు. మరి వీరిలో ఏ మంత్రి నయీంకు క్లోజ్ గా ఉన్నారోనన్న దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments