Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వంటే పడిచస్తా... నీ రేటెంతో చెప్పు... టాప్ హీరోయిన్‌కు చెర చూపించిన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్...

హైద‌రాబాద్: పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హ‌తం అయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ సెటిల్మెంట్లు, అరాచ‌కాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ డెకాయిట్ క‌న్ను సీనీ ప‌రిశ్ర‌మ‌పైనా ప‌డింది. సంచలన విషయం ఏంటంటే.. 10 మందికిపైగా సినిమా నిర్మాతలను న‌యీమ్ బెదిరించినట్లు తెల

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (13:55 IST)
హైద‌రాబాద్: పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హ‌తం అయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ సెటిల్మెంట్లు, అరాచ‌కాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ డెకాయిట్ క‌న్ను సీనీ ప‌రిశ్ర‌మ‌పైనా ప‌డింది. సంచలన విషయం ఏంటంటే.. 10 మందికిపైగా సినిమా నిర్మాతలను న‌యీమ్ బెదిరించినట్లు తెలుస్తోంది. గతంలో పెద్ద సినిమాలు నిర్మించి ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న నిర్మాత నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశాడని టాలీవుడ్ టాక్. 
 
కోళ్ల ఫారాల వ్యాపారాలు మొదలుపెట్టి సినిమా రంగానికి చెందిన ముఖ్య వ్యక్తికి కుడి భుజంగా ఉంటున్న, అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్న మరో నిర్మాతకు చెందిన నాదర్‌గుల్‌లో ఉన్న 25 ఎకరాలను ఈ గ్యాంగ్‌స్ట‌ర్ లాక్కున్నాడని తెలుస్తోంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన టాప్ హీరోయిన్ ఇంటిపైనా న‌యీమ్ కన్ను పడిందట. బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె ఇల్లు కాస్త లిటిగేషన్ వ్యవహారంలో ఉండటంతో న‌యీమ్‌ ఎంట్రీ ఇచ్చుకున్నట్లు సమచారం.
 
జూబ్లీహిల్స్‌లో ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయానికి సమీపంలో ఉండే ఆ ఇంటిని ఆ హీరోయిన్ కొనుక్కుని కొద్ది రోజులే అయింది. అయితే, ఇదికాస్తా వివాదంలో ప‌డింది. తాను ఆ హీరోయిన్‌కి ఫ్యాన్‌నని, అందుకే చాలా తేలిక‌గా సెటిల్మెంట్ చేస్తానని న‌యీమ్ ఈ వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చాడ‌ని తెలుస్తోంది. మొత్తంమీద ఆ హీరోయిన్ ఈ వ్యవహారాన్ని తెలంగాణ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడగా.. ఆ అధికారులు అసలు విషయం చెప్పారట. దీంతో తను ఉన్నానని, త్వరలోనే ఈ వ్యవహారంపై క్లారిటీ వస్తుందని చెప్పి పంపారట సదరు మంత్రి. 
 
ఆ తరువాత నయీమ్ తన అచరుడిని ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తున్న నిర్మాత వద్దకు పంపించి బెదిరించాడ‌ట‌. ఆ హీరోయిన్‌తో సినిమా చేయవద్దని హెచ్చరించాడట. ఇక హీరోయిన్‌తో అయితే చాలా వ‌ల్గ‌ర్‌గా ఫోన్‌లో మాట్లాడాడట నయీమ్. నీలాంటి వాళ్లని నేను బాగా వాడుకుంటానని, ఎంతకి అమ్ముడుపోతావో చెప్పు అని వ్యాఖ్యానించాడట. అయితే ఇదంతా ఆఫ్ ది రికార్డే గాని, ఇపుడు న‌యీమ్ చ‌నిపోవ‌డంతో బ‌య‌ట‌ప‌డింది. త‌రువాత జరిగిన పరిణామాల్లో ఆ హీరోయిన్ ఇక్కడ సినిమాలు తగ్గించి మకాం మొత్తం కోలీవుడ్‌కు షిప్ట్ చేసిందట.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments