Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగినపల్లిని పోలిన మరో మామిడి పండు - పేరు గంగా..

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (17:33 IST)
వేసవి కాలం వచ్చిందంటే మామిడిపండ్ల కోసం జనాలు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అందులో మామిడిపండ్ల రారాజుగా ఉన్న బంగినపల్లి మామిడిపండు అంటే పడిచచ్చిపోతారు. అయితే, ఇపుడు బంగినపల్లిని పోలిన మరో కొత్త రకం మామిడి పండును ఆవిష్కరించారు. దీనికి గంగా అని నామకరణం చేశారు. ఈ కొత్త గంగా మామిడిపండును తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
 
సంగారెడ్డి కేంద్రంగా గంగా నర్సరీ ఉంది. ఇక్కడ ఏళ్ల తరబడి ఐసీ మోహన్ అనే ఔత్సాహిక రైతు మామిడి పండ్లపై పలు ప్రయోగాలు చేస్తున్నారు. వీటి ఫలితంగా ఇపుడు గంగా అనే కొత్త రకం మామిడిపండును ఆవిష్కరించారు. 
 
చూడ్డానికి అచ్చుగుద్దినట్టుగా బంగినపల్లి మామిడి పండును పోలిన ఈ గంగా మామిడి పండుకు ఆయన తన నర్సరీ పేరునే పెట్టారు. ఈ కొత్త మామిడి పండును ఆయన మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
 
ఇదే అంశంపై మంత్రి ఓ ట్వీట్ చేశారు. "నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు. మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగాగా నామకరణం చేశారు. 
 
ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ.సి. మోహన్ ఆ వంగడాన్ని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో ఆవిష్కరింపజేశారు. ఆధునిక పరిజ్ఞానంతో ఫార్మ్ హౌజ్‌లకు సరికొత్త డిజైన్‌లను రూపొందించే మోహన్ మామిడిలో నూతన వంగడాన్ని సృష్టించడం అద్భుతమైన ప్రయోగం" అంటూ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments