హైదరాబాద్‌లో దారుణం.. రూ.పది కోసం హత్య చేశారా..?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (08:12 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పది రూపాయల కోసం దుండగులు ఓ పండ్ల వ్యాపారిని అతి దారుణంగా హత్య చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ హత్యను పోలీసులు చేధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షకీబ్ అలీ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. కూకట్‌పల్లి తులసీనగర్ పరిధిలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం ప్రగతి నగర్ రోడ్డులో తోపుడి బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు.
 
అయితే జనవరి 1వ తేదీన నసీం అనే వ్యక్తి షకీబ్‌వలీ వద్దకు వచ్చి కిలో ద్రాక్ష పండ్లు కొనుగోలు చేశాడు. కిలో ద్రాక్షకు రూ.30 అని చెప్పగా.. నసీం 20 రూపాయలు మాత్రమే ఇచ్చి షకీబ్‌అలీతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
 
దీంతో నసీం తన ఐదుగురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. అనంతరం వారు షకీబ్అలీ కడుపులో ఇనుపస్టాండ్‌తో బలంగా కొట్టారు. గాయాలతో ఉన్న అతడిని అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
ఇక, షకీబ్‌అలీని ఆస్పత్రిలో చేర్పించగా.. జనవరి 3వ తేదీన చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Diya: డిజిటల్ యుగంలో అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు : రఘుకుంచె

Anirudh Ravichander: ముప్పైవేల అభిమానులతో రికార్డు సృష్టించి కాన్సర్ట్ అందించిన అనిరుధ్ రవిచందర్

A.R. Rahman: యమహా మ్యూజిక్ ఇండియా సంస్థ అంబాసడర్‌గా ఎ.ఆర్. రెహ్మాన్

Sharwa:సీనియర్స్ తర్వాతే మేము : శర్వా ; అవకాశాల కోసం రాజశేఖర్ విజ్నప్తి

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments