టీఆర్ఎస్‌కు మరో షాకివ్వనున్న బీజేపీ: చింతలగట్టు విఠల్‌కు గాలం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (11:19 IST)
vittal
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు గాలం వేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన విఠల్ చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈటల రాజేందర్ చేరిక, హుజురాబాద్‌లో ఘనవిజయంతో కమలనాథుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే మరో ఉద్యమనేత బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చింతలగట్టు విఠల్‌ త్వరలో బీజేపీ తీర్థం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విఠల కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
 
టీఎస్‌పీఎస్పీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత ఆయనకు టీఎస్‌పీఎస్పీ చైర్మన్‌ లేదా ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా జరిగినా అది సాధ్యం కాలేదు. 
 
మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ మార్చడాన్ని తప్పుబట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలతో జరిగిన అంతర్గత చర్చల్లోనూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విఠల్‌ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా విఠల్‌ను సంప్రదించిన బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments