Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ డాక్టర్ : క్లినిక్‌లో చట్టవిరుద్ధంగా అబార్షన్లు

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (08:55 IST)
ఓ యువకుడు.. ఎలాంటి అర్హతలు లేకున్నా యూట్యూబ్ చూసి డాక్టరుగా అవతారమెత్తాడు. చట్ట విరుద్దంగా అబార్షన్లు చేయసాగాడు. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ వైద్యుడి బాగోతం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బహిర్గతమైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణా రాష్ట్రం వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి. బీఎస్సీ చదివిన ఇంద్రారెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. 
 
హన్మకొండలోని ఎకశిలా పార్క్ ఎదురుగా రెండు నెలల కిందట హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. తనకు అర్హత లేకున్నా వైద్యుడి అవతారం ఎత్తాడు. ఇందులోభాగంగా హోటల్ నడిచే ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని సిటీ హాస్పిటల్ పేరుతో ఆస్పత్రిని, మెడికల్ షాపు ఏర్పాటు చేసి, జనానికి  వైద్యం అందిస్తూ వచ్చాడు. 
 
ఈ ఆస్పత్రిలో ఆర్థో సంబంధింత వైద్యం అందిస్తామని బ్యానర్ ఉన్నా.... లోపల చట్ట విరుద్దమైన అబార్షన్లు చేయసాగాడు. ఈ విషయం బయటకుపొక్కింది. ఇద్దురు ఆడపిల్లలు ఉన్న ఓ వివాహితకు అబార్షన్ చేసినట్లు వైద్యులకు సమాచారం అందింది. దీంతో వైద్యశాఖాధికారులు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. 
 
అధికారుల రాకను పసిగట్టిన నకిలీ వైద్యుడు గోడదూకిపారిపోయాడు. అధికారులు ఆస్పత్రితోపాటు.. మెడికల్ షాపును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments