జూనియర్‌ కళాశాలలను లక్ష్యంగా చేసుకున్న ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (16:12 IST)
పదిహేను నుంచి 18 సంవత్సరాల నడుమ వయసు చిన్నారులకు కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో, ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ తమ మొదటి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను 07జనవరి 2022 న ప్రారంభించింది. ఈ డ్రైవ్‌తో ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాలల ఈసీఐఎల్‌ మరియు సుచిత్ర శాఖలలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు.

 
ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను కీసరలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం భాగస్వామ్యంతో నిర్వహించారు. ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాల, ఈసీఐఎల్‌కు చెందిన 230 మంది డే స్కాలర్‌ విద్యార్థులలో 147 మందికి విజయవంతంగా వ్యాక్సిన్‌ వేశారు. కోవిడ్‌ మార్గదర్శకాన్నీ అనుసరించడంతో పాటుగా తగిన భద్రతా చర్యలను తీసుకుని విజయవంతంగా ఈ డ్రైవ్‌ను ఇనిస్టిట్యూషన్‌ నిర్వహించింది.

 
ఈ సందర్భంగా ఎక్స్‌లెన్సియా ఇనిస్టిట్యూషన్స్‌ ఫౌండర్‌-డైరెక్టర్‌ వెంకట్‌ మాట్లాడుతూ, ‘‘ మా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ టీకా కార్యక్రమం నిర్వహించాము. కోవిడ్‌ 19 కారణంగా ఇప్పటికే సాధారణ విద్యా జీవితం ప్రభావితమైంది. ఓ ఇనిస్టిట్యూట్‌గా మా ప్రధాన లక్ష్యమేమిటంటే భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేయడంతో పాటుగా వ్యాక్సిన్‌లను సురక్షిత వాతావరణంలో మా విద్యార్థులకు అందుబాటులో ఉంచడం. తద్వారా సంప్రదాయ తరగతులు తిరిగి తీసుకురావడం మరియు కాలేజీలు, పాఠశాలలు తిరిగి పనిచేసేలా చేయడం. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేనేజ్‌మెంట్‌ తమ వంతు తోడ్పాటునందిస్తుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments