Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస కౌరవులపై తెదేపా అర్జున్ రేవంత్ యుద్ధం... ఎర్రబెల్లి కామెంట్

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (13:12 IST)
తెరాస ఏది చెప్పినా కాంగ్రెస్ పార్టీ తానా అంటే తందానా అంటోందనే కామెంట్లు వినబడుతున్నాయి. తెలంగాణ శాసన సభలో అధికార పార్టీ తెరాసను ఎదుర్కొంటున్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే మంచి మార్కులే వస్తున్నాయనే వాదనలు వినబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర్నుంచీ తెదేపా నాయకులు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి అధికార పార్టీని ప్రజా సమస్యలపై ఇరుకున పెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఎర్రబెల్లి పాలకపార్టీపై మండిపడ్డారు.
 
టీటీడీపీ సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాము సభలో పాండవుల వలె యుద్ధం చేస్తున్నామని... టీఆర్ఎస్ కౌరవ సమూహమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మహాభారతంలో అర్జునుడిగా ఎర్రబెల్లి పేర్కొంటూ, రేవంత్ రెడ్డిని చూస్తే టీఆర్ఎస్ నేతలు జడుసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను టీఆర్ఎస్ పాలించే ఐదేళ్లూ తమను శని వెంటాడుతుందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments