హైద‌రాబాద్‌లో ప‌టిష్టంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:35 IST)
జిహెచ్ఎంసి ఎన్నిక‌ల ప్రకటన నేప‌థ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిలో భాగంగా  గ్రేటర్ హైదరాబాద్ లో  4 వేల‌కు పైగా పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు తొల‌గించిన‌ట్టు జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి, క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, భ‌వ‌నాలు, ప్ర‌హ‌రీగోడ‌లు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు. న‌గ‌రంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశామ‌ని డి.ఎస్.లోకేష్ కుమార్ వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments