Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుణ్ షాకింగ్ సంగతులు... డ్రగ్స్ కోసం సినిమా వాళ్లకు సీక్రెట్ గదులు...

డ్రగ్స్ కేసు విచారణలో హీరో తరుణ్ షాకింగ్ సంగతులు చెపుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో వున్న 19 ప్రధాన పబ్ సెంటర్లకు గాను 15 పబ్బుల్లో మాదక ద్రవ్యాలు యధేచ్చగా లభ్యమవుతున్నాయని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. తను పబ్ ప్రారంభించిన కొత్తల్లో సర్వీస్ బాయ్స్ డ

Webdunia
శనివారం, 22 జులై 2017 (22:31 IST)
డ్రగ్స్ కేసు విచారణలో హీరో తరుణ్ షాకింగ్ సంగతులు చెపుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో వున్న 19 ప్రధాన పబ్ సెంటర్లకు గాను 15 పబ్బుల్లో మాదక ద్రవ్యాలు యధేచ్చగా లభ్యమవుతున్నాయని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. తను పబ్ ప్రారంభించిన కొత్తల్లో సర్వీస్ బాయ్స్ డ్రగ్స్ సమకూర్చేవారని వెల్లడించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసులో పబ్బుల గుట్టును విప్పేస్తున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు విచారణ మొదలు పెట్టి మూడురోజులు కాలేదు. అప్పుడే అంతర్జాతీయ మాఫియా నుంచి బెదిరింపు కాల్ వచ్చేసింది. నేరుగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు కాల్ చేసిన మాఫియా దుండుగులు ఆఫ్రికన్ భాషలో దూషిస్తూ బెదిరించారు. ఉన్నఫళంగా విచారణ నిలిపేయకపోతే నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. హైదరాబాద్‌లో లాగిన తీగ అంతర్జాతీయ మాఫియా డొంకంతా కదిల్చినట్లు స్పష్టమవుతోంది. వారంరోజులుగా అకున్ సబర్వాల్‌కు ఇదేవిధమైన బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది.
 
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారం అంతు తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. డ్రగ్స్‌ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్‌ చేసి హెచ్చరికలు చేశారు. అకున్‌ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. ఇంటర్నెట్‌ ద్వారా అగంతుకుడు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్‌ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వారం రోజులుగా కూడా ఆయనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయంట. దీంతో డ్రగ్స్‌ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. 
 
ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ ముఠా నెదర్లాండ్‌, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్‌ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్స్‌ మాఫియా తాజాగా చేసిన ఫోన్‌ కాల్స్‌పై ఇంటెలిజెన్స్‌ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. 
 
ఈ కేసును విచారిస్తున్న సిట్‌ అధికారులు ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామేన్‌ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15 మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. తరుణ్‌ విచారణలో కీలక సంగతులు వెల్లడవుతున్నాయి. ఇంకోవైపు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం రాత్రి హైదరాబాదులోని పబ్ సెంటర్ల ముందు ఆందోళనకు దిగారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments