Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్ గూటికి డీకే అరుణ?

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (15:01 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార భారాస, విపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే, ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 
 
ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ మాజీనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీకి రాంరాం చెప్పేసి, తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కూడా తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ ఎన్నికల షెడ్యూల్ వెల్లడైనప్పటి నుంచి అధికార బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనని నిజం చేసేలా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. తాజాగా, డీకే అరుణ కూడా సొంత గూటికి చేరుతున్నారనే ప్రచారం సాగుతుంది. 
 
ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమే లేదని తెలిపారు. తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments