పోలీసులు గులాబీ అంగీలు తొడుక్కున్నరా? : డీకే అరుణ

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:07 IST)
దుబ్బాక  బీజేపీ అభ్యర్థిపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర బలగాలను భద్రత కోసం పంపాలన్నారు.

హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో టీఆర్​ఎస్ పై వ్యతిరేకత ఉందని, అందుకే  ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు బంధువులు ఇండ్ల పై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

‘‘పోలీసులు గులాబీ చొక్కాలు తొడుక్కున్నరా.. టీఆర్​ఎస్​ కండువాలు వేసుకున్నరా పోలీసుల వెహికల్స్ లో డబ్బులు పంపుతున్నరు. కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదనే విషయం గుర్తించుకోవాలి అని ఆమె హెచ్చరించారు.

పోలీసులంటే ప్రజలు అస్యహించుకునేలా చేసుకోవద్దన్నారు. బీజేపీ గెలుస్తుందని సర్వేల్లో తెలుసుకున్న టీఆర్ ఎస్ అడ్డదారులు తొక్కుతున్నదని,  మంత్రి హరీశ్​ వ్యవహార శైలి సరిగా లేదని, ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారన్నారని మండిపడ్డారు.

ఎన్నికలు సరిగా జరిగేలా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఆహంకారం తగ్గాలంటే దుబ్బాక లో బీజేపీని  గెలిపించాలని, టీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పాలని, ఒక చారిత్రక తీర్పు దుబ్బాక ఓటర్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments