Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలాలో పడిపోయిన సుమేధ.. కేటీఆర్‍పై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (19:51 IST)
సైకిల్‌పై వెళుతూ సుమేధ అనే బాలిక నాలాలో పడిపోయింది. దీనదయాళ్‌నగర్‌ ఓపెన్‌ నాలా వెంట వెతగ్గా రోడ్డు నంబర్‌ నాలుగు దగ్గర అదే నాలాలో బాలిక సైకిల్‌ కనిపించింది. ఆ నాలా వెంబడి రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువు దాకా గాలించగా అక్కడ బాలిక మృతదేహాన్ని దొరికింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
 
ఇదే ప్రాంతంలో గతంలోనూ ఓ మహిళ నాలాలో పడి మరణించింది. గత ఏడాది పాత బస్తీ, ఎల్‌బీ నగర్‌లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో వరద ముంచెత్తినప్పుడు ఓపెన్‌ నాలాల్లో పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్‌పై నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమేధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 
 
సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇటీవల నేరెడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌లో సరదాగా సైకిల్‌పై బయటకు వెళ్లిన చిన్నారి సుమేధ (12) ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments