Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్ : దానం

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (17:20 IST)
మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్ అని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆరోపించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకున్నట్టయింది. అలాగే, ఆ పార్టీ నేతలు దానం నాగేందర్, మర్రి శశిధర్ రెడ్డిల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. విభజించు పాలించు సిద్ధాంతాన్ని శశిధర్ రెడ్డి అవలంభిస్తున్నారంటూ దానం ఆగ్రహించారు.
 
సనత్ నగర్ ఉప ఎన్నికలు రాబోతుండటంతోనే మర్రి శశిధర్ రెడ్డి హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. నగర కాంగ్రెస్‌ను విభజించి పబ్బం గడుపుకోవాలని శశిధర్‌ రెడ్డి చూస్తున్నారని దానం ఆరోపించారు. తాను అందుబాటులో ఉన్నా సంప్రదించలేదని, ఇదంతా తెలిసినా పీసీసీ చీఫ్‌ పొన్నాల ఇన్‌స్టంట్‌ కాఫీలా వ్యవహరిస్తున్నారని నాగేందర్‌ విమర్శించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని దానం స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, తనకు చెప్పకుండా హైదరాబాద్‌లో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు చెప్పకుండా పార్టీ వ్యవహారాలు నడపడం ఎంతవరకు సబబని దానం ప్రశ్నించారు. నగర అధ్యక్షునిగా తాను పనికి రాను అనుకుంటే మరో నేతను తీసుకునే అధికారం పొన్నాలకు ఉందని.. అయితే మర్రి శశిధర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయలేదన్నారు. 
 
తాను పదవి లేకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. అధికార పార్టీతో, సీఎంతో పైరవీలు తనకు అవసరం లేదని దానం స్పష్టం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్. ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్దనేత అనుకుంటున్నాడు. నాకు చెప్పకుండానే ఇళ్ల నిర్మాణ అంశంపై నగర నేతలతో కలిసి గవర్నర్ కలవడం సరికాదు అని దానం విమర్శించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments