Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానం నాగేందర్ రాజీనామా... తెలంగాణలో కాంగ్రెస్ మడతడిపోయినట్టేనా...?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (12:36 IST)
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లిపోతున్నాయా.. అంటే అవుననే అనుకోవాల్సి వస్తుంది. నిన్న గ్రేటర్ ఫలితాలు అలా ప్రకటించారో లేదో తెల్లారేసరికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేసేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఎన్నడూ చవిచూడని పరాభవాన్ని చవిచూసింది. గులాబీ పార్టీ షాకుతో హస్తం గల్లంతైంది. దీనితో ఓటమికి బాధ్యతగా తను రాజీనామా చేస్తున్నట్లు దానం ప్రకటించారు.
 
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదన్న దానం టీఆర్ఎస్ హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారని వెల్లడించారు. తనకు గ్రేటర్ ఎన్నికల సమయంలో పూర్తి బాధ్యతలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేశానంటూ చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి వికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పడింది. మరి ఇంకెంతమంది రాజీనామాల బాట పడతారో చూడాలి.

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments