అత్యంత విషమంగా ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం... ఐసీయూలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.
 
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నారు. తాజాగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. 
 
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, పార్టీ అధినాయకత్వంతో ఏర్పడిన విభేదాలు ఉన్నప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతూ, యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. డీఎస్ చిన్న కుమారుడు డి.అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments