Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకకాలంలో ఆరు ట్రాఫిక్ రూల్స్‌ బ్రేక్.. సైబ‌రాబాద్ పోలీసులు ట్వీట్ వైరల్

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:09 IST)
హైద‌రాబాద్‌కు చెందిన ముగ్గురు యువ‌కులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించారు. కేవలం ఉల్లంఘన మాత్రమే కాదు.. మితిమీరిన స్థాయిలో రూల్స్ తప్పారు. నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఫొటోను సైబ‌రాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. 
 
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువ‌కులు ఓ బైక్‌పై వెళుతున్నారు. వాళ్లు చేసిన విన్యాసం ఏంటో తెలుసా? మ‌ధ్యలో కూర్చున్న వ్యక్తి త‌న రెండు చేతుల‌ను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చుట్టేసి మొబైల్ ఫోన్ ప‌ట్టుకున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ ఫోన్‌లో చూస్తున్నాడు. పైగా వాళ్లకి మాస్కులు ఉన్నా సరిగ్గా పెట్టుకోలేదు. హెల్మెట్ కూడా లేదు. దీంతో అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు స‌ద‌రు యువ‌కుల విన్యాసాన్ని ఫోటో తీసేశారు.
 
ఇక‌ ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు.. ‘‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. ప‌ట్టుత‌ప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ యువ‌కులు చేసిన ఈ తప్పునకు విలువ ఎంత పడిందో తెలుసా? ఏకంగా రూ.3600. ఈ ముగ్గురు ఈ ఒకే విన్యాసంతో ఏకకాలంలో ఆరు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారు. 
 
బైక్ వెన‌కాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధ‌రించని కార‌ణంగా రూ.100, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, బ‌హిరంగ ప్రదేశాల్లో మాస్కు స‌రిగ్గా ధ‌రించ‌నందుకు రూ.1000, డ్రైవ‌ర్ హెల్మెట్ ధ‌రించ‌ని కార‌ణంగా రూ.200, వెనుక చూసేందుకు సైడ్ మిర్రర్స్ లేని కారణంగా మరో రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఇలా మొత్తం జరిమానా విలువ రూ.3,600కు చేరింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments