కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు.. లోపల నరహంతకుడు: నారాయణ.. నారాయణ

హైదరాబాద్‌ను పోలీసుల మయం చేసి, తెలంగాణ నిరుద్యోగుల ర్యాలీని భగ్నం చేసి టీజేఎసీ చైర్మన్ కోదండరామ్‌ను తలుపులు బద్దలు గొట్టి మరీ లాగి పోలీసు స్టేషన్‌కీడ్చిన కేసీఆర్ అదే సమయంలో పరమ భక్తుడిలా తిరుమల సందర్సించి దేవుడికి మొక్కులు చెల్లించడంపై నారాయణ నిప్పుల

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (06:40 IST)
సీపీఐ నేత నారాయణ దుడుకు నోటి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటారు కానీ తాను చెప్పాల్సింది ముక్కుసూటిగా చెప్పడంలో తనను మించిన వారు లేరనే చెప్పాలి. హైదరాబాద్‌ను పోలీసుల మయం చేసి, తెలంగాణ నిరుద్యోగుల ర్యాలీని భగ్నం చేసి టీజేఎసీ చైర్మన్ కోదండరామ్‌ను తలుపులు బద్దలు గొట్టి మరీ లాగి పోలీసు స్టేషన్‌కీడ్చిన కేసీఆర్ అదే సమయంలో పరమ భక్తుడిలా తిరుమల సందర్సించి దేవుడికి మొక్కులు చెల్లించడంపై నారాయణ నిప్పులు చెరిగారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడిలా కనిపిస్తున్నారని, లోపల నరహంతకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఏపీ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ పోలీస్‌ క్యాంపుగా మారిపోయిందనీ పాకిస్తాన్‌ సరిహద్దుగా మార్చేశారన్నారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వండన్న విద్యార్థుల కోరిక న్యాయబద్ధమైనందునే జేఏసీ చైర్మన్‌ కోదండరామ్, కమ్యూనిస్టులు దానికి మద్దతు పలికారని తెలిపారు. కోదండరామ్‌ను, విద్యార్థి నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారన్నారు.
 
ఒకవైపు తిరుపతిలో దైవపూజ చేస్తూ మరొకవైపు ఇలా అమానవీయంగా కేసీఆర్‌ ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఇలాంటి నిర్బంధం ఉంటే ఎలా ఉండేదని ప్రశ్నించారు. 
 
మరోవైపు నారాయణ ఏపీ సీఎం చంద్రబాబునూ వదల్లేదు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు కేంద్రానికి బానిసలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగిందనీ, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని సీఎం, మంత్రులు ప్రచారం చేశారనీ అలాంటిదేమీ లేదన్నారు. కేబినెట్‌ ఎజెండాలో ఆ అంశమే లేదనీ ఇలా ఎన్నిరోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments