తెలంగాణాలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా రోగులు .. ఒకే రోజు 12 మంది మృతి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రతి రోజూ కనీసం రెండు వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బుధవారం ఒక్క రోజే ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు. 
 
అలాగే, బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,896 కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 2,06,644 మంది ఈ వైరస్ బారినపడినట్టు అయింది. అలాగే, 12 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,201కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. 
 
మరోవైపు, మహమ్మారి బారినుంచి గత 24 గంటల్లో 2,067 మంది కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,79,075కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 26,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 21,724 మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 50,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వీటితో కలుపుకుని ఇప్పటివరకు 33,96,839 మందికి పరీక్షలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments