Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఎలా జరుగుతోంది?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:13 IST)
జూన్ 2... అంటే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ  దినోత్సవం. 2014లో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 8, 2014న కాంగ్రెస్, బిజెపి మద్దతుతో తెలంగాణ బిల్లును లోక్ సభ ఆమోదించింది.
 
బిజెపి, ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుతో తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు రాష్ట్రపతి అంగీకారం పొంది 2014 మార్చి 1న గెజిట్‌లో ప్రచురించబడింది. మార్చి 4, 2014న భారత ప్రభుత్వం జూన్ 2, 2014ను తెలంగాణ నిర్మాణ దినంగా ప్రకటించింది.
 
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ COVID-19 మహమ్మారి కారణంగా వేడుకలు మునుపటి సంవత్సరాల మాదిరిగా జరుగటంలేదు. తెలంగాణ నిర్మాణ దినోత్సవం రోజున, రాష్ట్ర ప్రజలు స్నేహితులు, పొరుగువారు, వారి కుటుంబాలతో సమయాన్ని గడపడం ద్వారా ఈ రోజును జరుపుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments