Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త డబ్బులు చెల్లించలేదనీ భార్య పైటకొంగుబట్టి లాగిన వ్యాపారి!

కొందరు వ్యాపారుల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. భర్త తీసుకున్న బాకీ చెల్లించలేదన్న అక్కసుతో భార్య పైటకొంగుపట్టిలాగడమే కాకుండా ఆమెన చెరబట్టాడో వ్యాపారి. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (12:16 IST)
కొందరు వ్యాపారుల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. భర్త తీసుకున్న బాకీ చెల్లించలేదన్న అక్కసుతో భార్య పైటకొంగుపట్టిలాగడమే కాకుండా ఆమెన చెరబట్టాడో వ్యాపారి. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నందిగామకు చెందిన సింగిరికొండ మోహన్ రావు, మిర్యాలగూడకు చెందిన కనపర్తి సత్యప్రసాద్‌లు కలిసి కొంత పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించారు. తర్వాత గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే, తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మోహన్ రావుపై సత్యప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఓ కోర్టు కేసు నిమిత్తం మిర్యాలగూడకు వచ్చిన మోహన్ రావు దంపతులను డబ్బు కోసం సత్యప్రసాద్ గృహనిర్బంధం చేశాడు. మూడు రోజుల తర్వాత డబ్బు తేవాలని బెదిరిస్తూ, మోహన్ రావును మాత్రం వదిలి, అతని భార్యను మాత్రం తనవద్దే ఉంచుకున్నాడు. 
 
ఆ తర్వాత సత్యప్రసాద్ ఆమెను బెదిరించి ఇంటి పనులు చేయించుకోసాడు. ఈ క్రమంలో నందిగామ వెళ్లిన మోహన్ రావు, తనకు భార్యతో కలిపి జాయింట్ ఖాతా ఉందని, ఆమె కూడా వస్తేనే డబ్బు తెచ్చే వీలవుతుందని చెప్పడంతో, ఆమెను తీసుకుని నందిగామ వెళ్లారు. ఎలాగోలా సత్యప్రసాద్ నుంచి తప్పించుకున్న ఆ జంట, నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments