Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో మే 29 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నాం.. కేసీఆర్

Webdunia
బుధవారం, 6 మే 2020 (14:21 IST)
రాష్ట్రంలో మే 29 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాను నియంత్రించామని.. ప్రజలంతా లాక్ డౌన్‌కు మంచిగా సహకరిస్తున్నారని.. మరికొన్నాళ్లు ఓపిక పడితే కరోనా నుంచి బయటపడుతామని తెలిపారు. ఇలాంటి ఎపిడ‌మిక్స్ వ‌చ్చిన‌ప్పుడు 70 రోజుల పాటు కంట్రోల్ చేయ‌గ‌లిగితే దానిని పూర్తిగా క‌ట్ట‌డి చేయొచ్చ‌ని వెల్లడించారు.  
 
ప్ర‌జ‌లంతా భౌతిక దూరం పాటించి మ‌రికొన్నాళ్లు స్వీయ నియంత్ర‌ణతో ముందుకు సాగాల‌ని కోరారు. కేంద్రం లాక్ డౌన్ లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించింద‌ని, వాటిని య‌థావిధిగా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు షాపులు తెరుచుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
రెడ్ జోన్ల‌లోనూ షాపుల‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చింద‌ని, కానీ మ‌న రాష్ట్రంలో ఏవీ తెర‌వ‌డానికి లేద‌న్నారు. నిర్మాణ ప‌‌నులు త‌ప్ప ఎటువంటి షాపులు తెర‌వ‌డానికి లేద‌న్నారు. తెలంగాణ‌లో ఆరు జిల్లాలు మాత్ర‌మే రెడ్ జోన్ లో ఉన్నాయ‌ని, మిగిలిన 27 జిల్లాలు ఆరెంజ్, గ్రీన్ జోన్ల‌లోకే వస్తాయ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments