కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ ఫైర్.. ఆయన్నెందుకు వెనకేసుకొచ్చారు...

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:53 IST)
వేములవాడ, సిరిసిల్ల తనకు రెండు కళ్లు అంటూ.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ స్పందించారు. ఇక్కడ ఎమ్మెల్యే లేనట్టుగా మీరు భావించారా? ఇక రాడనేది మీ భావన? అని ఆయన మంత్రిని ప్రశ్నించారు. గత 11 నెలలుగా ఈ దేశంలో లేని చెన్నమనేని రమేశ్‌ను వెనకేసుకొని రావడం ఏంటని ఆయన కేటీఆర్‌ను నిలదీశారు. 
 
తమ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని చెబితే ప్రజలు చెన్నమనేనికి ఓటేశారన్న శ్రీనివాస్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్మనీ నుంచి పాలిస్తానంటే ఓటేసే వాళ్లు కాదన్నారు. మావాడని వేములవాడ ఎమ్మెల్యేను మీరు వెనకేసుకొచ్చినట్లు కనిపిస్తోందని కేటీఆర్‌ను ఆది శ్రీనివాస్ విమర్శించారు. 
 
ఎమ్మెల్యేపై ప్రజావ్యతిరేకత కనిపిస్తోందని.. ఈ విషయాన్ని కేటీఆర్ సైతం గమనించారన్నారు. సాక్షాత్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేవాలయాన్ని రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. నిన్నటి సమీక్షా సమావేశంలో ఈ విషయంపై ఎందుకు చర్చించలేదని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
 
మీ నాయకుడి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో.. దాన్ని తగ్గించడం కోసమే మీరు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఇక్కడి శాసన సభ్యుడిని వెనకేసుకొచ్చినట్లు కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కానిస్టేబుల్ కనకం 3 ప్రతి సీజను బాహుబలి లాగా హిట్ అవుతుంది :కె. రాఘవేంద్రరావు

కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, మనమూ పోతాం: రేణు దేశాయ్

ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

VD 14: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14 సినిమా ఉంటుంది - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments