Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం సేక‌ర‌ణపై ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (10:27 IST)
యాసంగిలో తెలంగాణ‌లో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యాసంగిలో వ‌చ్చే మొత్తం ధాన్యాన్ని కేంద్రం చేత కొనిపించ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని మోదీకి బుధ‌వారం లేఖ రాశారు.
 
ఈ వ్య‌వ‌హారంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ఇప్ప‌టికే ఓ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించిన కేసీఆర్‌.. కేంద్ర మంత్రుల‌తో భేటీ కోసం త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చరుల బృందాన్ని ఇప్ప‌టికే ఢిల్లీ పంపారు. 
 
ఒకే దేశం ఒకే ధాన్యం సేక‌ర‌ణ విధానం అన్న నినాదాన్ని ఆ లేఖ‌లో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. ఈ విష‌యంపై ఓ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకునేందుకు ఓ అత్యున్న‌త స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని ప్ర‌ధానికి సూచించారు. 
 
అంతేకాకుండా పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ అంశాన్ని లేవ‌నెత్తి ఫ‌లితం సాధించే దిశ‌గా క‌ద‌లాల‌ని పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments