KCR సంచలన ప్రెస్ మీట్: ఏం చెప్పబోతున్నారో ?

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (16:16 IST)
తెలంగాణలో రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మునుగోడుకు త్వరలో ఉప ఎన్నిక రానుండటంతో అన్ని పార్టీలు అక్కడే ఫోకస్ చేశాయి. 
 
అయితే ఉప ఎన్నిక రాదని.. అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.
 
ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి మీడియా ముందుకు రానున్నారు. శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్‌మీట్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నుంది. 
 
రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడుతారా? అన్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పెద్ది కోసం అఖిల్ చిత్రం లెనిన్ వాయిదా పడింది

Ramcharan: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ తో ఇండియా నెం.1 ట్రెండింగ్‌లో రామ్ చరణ్

Akshaye Khanna: మహాకాళి లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న అక్షయ్ ఖన్నా

Biker: శర్వా 23 కేజీలు తగ్గారు - న్యూజీలాండ్, ఆస్త్రేలియా రేసర్స్ ని రప్పించాము : అభిలాష్ రెడ్డి

Allu Arjun: గీక్ పిక్చర్స్ సీఈవో టొమాట్సు కొసానోకు దేశ సంస్కృతి వెల్లడిస్తున్న అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

తర్వాతి కథనం
Show comments