కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు. ఈ జిల్లాలోని బాన్సువాడలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి కారులో రోడ్డు మార్గంలో తిమ్మాపూర్ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. 
 
అక్కడ శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బ్రహ్మోత్సవ క్రతువులో పాల్గొన్న తర్వాతీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు రెండున్నర గంటల పాటు సాగనుంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. బాన్సువాడ పట్టణంతో పాటు ఆలయ ప్రాగణం, పరిసర ప్రాంతాలను సీఎం వ్యక్తిగత రక్షణ బృందం, డాగ్ స్క్వాడ్ నిశితంగా తనిఖీలు నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments